Wednesday, October 16, 2013

ఎండను ధారలుగా తాగ౦దే 

భూమి


ఆకాశానికి మబ్బుచీరలు నేయదు 

________________(16/10/2013)__________

Thursday, September 19, 2013


కొండలన్నీ మన్నవుతాయి 

మనిషౌతాడ౦టే


నీలో మరుగుజ్జు 

_____________(20/9/2013)



నోటి కందే వరకే 

నిశ్శబ్దం 


సగం ఖాళీ గ్లాసులో 


_____________(20/9/2013)

Wednesday, September 18, 2013

తన మేను తాకిన గాలానికి దొరక్కుండా 

చేపల్ని చీర కుచ్చిల్ల కింద దాచి 


వడి వడిగా నవ్వుతూ నడిచింది నది 

________________________ (13/6/2013)__


ఎండిపోయిన చెట్టుపై ఏడుస్తూ 

గూళ్ళు 


పక్షులమీద బెంగ పెట్టుకున్నాయి 


________________________ (13/6/2013)__


ఆకాశపు సముద్రంలో

సూర్యుడు


వెలుతురు మోసుకెళ్లే పడవ



________________________ (13/6/2013)__

నవ్వుతూ తుళ్లుతూ , వానా వానా 

అంటూ పాడడమే కాదు


గొడుగులు కూడా ఏడుస్తాయి


________________________ (13/6/2013)__




Tuesday, September 17, 2013

కొత్త వెలుగు

కాలిపోయిన అగ్గిపుల్ల

 
నవ్విన దీపం 
_____________ (31/8/2013)__




కష్టమేం కాదు 

చదవడం నేర్చుకో


కరచాలనాల్ని
______________(28/8/2013)




కొత్త గుణింతం నేర్చుకుని

ప్రతి ఉదయం 

ఉదయిస్తాడు సూర్యుడు
____________________(22/8/2013)



ఆలోచనలు కాల్చేస్తాయి 

మనసుపై 


అంతా బాగుందనే దుప్పటి కప్పకపోతే 


____________________(26/9/2013)

వర్షంలో తడుస్తూ


పాత సైకిల్


నాన్న జ్ఞాపకమట


_____________(18/9/2013)


ఎగిరిపోయిన పక్షి

దాని పాట


వర్షంలో ఆకులు కదిలినప్పుడల్లా

______________(18/9/2013)



స్పష్టంగా వినగలం

నిశ్శబ్ధపు శబ్ధం


సమాధి గోడలమధ్యే


____________________(2/7/2013)



          
ఉదయాన్నే తెరిచిన కళ్లు

చీకటి గోళం మీద నుంచి 


మరో వెలుగు గ్రహం మీదకు దూకినట్టు


__________________ (3/7/2013)


ఖాలీగా ఉన్న నటనాస్థలి

ఆత్మ 


ఏ ఆలోచనలు రంగమెక్కుతాయో అది నువ్వు 



______________________(4/6/2013)


చెట్టు చెట్టు తిరుగుతూ 

ఉడత తన నేస్తం దొరకలేదని 


పళ్ళు ఏడుస్తూ రాలాయి

 
___________________( 2/12/2012)



కరెంటు తీగపై పక్షులు 

కావు కావు మనే అరుపులు 


లోకుల నోటి మాటలు

 ...
_______________________(30/11/2012)-