వర్షంలో తడుస్తూ
పాత సైకిల్
నాన్న జ్ఞాపకమట
_____________(18/9/2013)
ఎగిరిపోయిన పక్షి
దాని పాట
వర్షంలో ఆకులు కదిలినప్పుడల్లా
______________(18/9/2013)
స్పష్టంగా వినగలం
నిశ్శబ్ధపు శబ్ధం
సమాధి గోడలమధ్యే
____________________(2/7/2013)
ఉదయాన్నే తెరిచిన కళ్లు
చీకటి గోళం మీద నుంచి
మరో వెలుగు గ్రహం మీదకు దూకినట్టు
__________________ (3/7/2013)
ఖాలీగా ఉన్న నటనాస్థలి
ఆత్మ
ఏ ఆలోచనలు రంగమెక్కుతాయో అది నువ్వు
______________________(4/6/2013)
చెట్టు చెట్టు తిరుగుతూ
ఉడత తన నేస్తం దొరకలేదని
పళ్ళు ఏడుస్తూ రాలాయి
___________________( 2/12/2012)
కరెంటు తీగపై పక్షులు
కావు కావు మనే అరుపులు
లోకుల నోటి మాటలు
...
_______________________(30/11/2012)-
No comments:
Post a Comment